కాలు పోగొట్టుకున్న పవన్ కళ్యాణ్ వీరాభిమానికి జనసేన నాయకుల పరామర్శ

కాలు పోగొట్టుకున్న పవన్ కళ్యాణ్ వీరాభిమానికి జనసేన నాయకుల పరామర్శ

                శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని దుక్క శేఖర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తన ఒక కాలును పోగొట్టుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న టెక్కలి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు ఆదివారం ఆయన ఇంటికెళ్ళి పరామర్శించారు. జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఎంతో క్రమశిక్షణ కలిగిన శేఖర్ కు ప్రమాదవశాత్తు ఇలా జరగడం పట్ల యాదవ్, శ్రీధర్ లు చాలా బాధను వ్యక్తపరిచారు. అలాగే శేఖర్ కు కృత్రిమ కాలు సమకూర్చడానికి అయ్యే ఖర్చు తో పాటు, ఆయన పూర్తిగా కొలుకునేంత వరకూ అయ్యే ఆసుపత్రి ఖర్చులను తాము భరిస్తామని ఈ సందర్భంగా హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఎంపీటీసీ 2 అభ్యర్థి రాయి సునీల్, హనుమంతు దిలీప్, పసుపురెడ్డి సోమేశ్, దారపు కిషోర్ రెడ్డి, దుక్క విశాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన కార్యాలయం వద్ద అర్ధరాత్రి పూట బ్యానర్లు తొలగించడం హేయమైన చర్య