గెడగాం గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు వజ్రగడ జానీ

జనసేన

           పార్వతీపురం ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం, వీరగట్టం మండలం, గెడగాం గ్రామంలో  జనసేన నాయుకులు వజ్రగడ జానీ గ్రామంలో పర్యటించారు. విద్యార్థులు పరీక్షలకు చదువుకుందాం అంటే అసలు కరెంట్ ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామ ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు 2000మంది చనిపోతే ప్రభుత్వం ప్రతిపక్షం కనీసం పట్టించుకోకపోతే రెండు చోట్లా ఓడిపోయిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు చొప్పున 5కోట్లు ఇవ్వడం జరిగిందని రైతులకు వివరించారు. ఇలాంటి నాయకుడుకు అధికారం ఇవ్వండి ఇంకా ఎంతో గొప్పగా చేసి చూపెడతారు అని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  సమస్యలను పరిష్కరించాలని అప్పలనాయుడు డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి