
తూర్పుగోదావరిజిల్లా, అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు నిరసన దీక్ష చేపట్టారు. కోవిడ్ వ్యాధికి గురై ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వారందరికి ఆక్సిజన్ అందించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శెట్టిబత్తుల రాజబాబు దీక్ష చేపట్టారు. కోనసీమ ప్రాంతం అంతా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని గొల్లవిల్లి గ్రామంలో ఆక్సిజన్ బెడ్స్ తో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ అందక ఊపిరి వదులుతున్న అమాయక ప్రజలను రక్షించాలన్నారు. అమలాపురం డివిజన్ ఇప్పటికే వందలాది మంది మృతికి ఆక్సిజన్ కొరత కారణం అన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక అకాల మరణాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక మరణించడం అంటే ప్రభుత్వ హత్యగానే భావించాలని, ఆక్సిజన్ అందక మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలోను యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లపల్లి గ్రామాన్ని ప్రత్యేకజోన్‌గా తీసుకుని, గ్రామంలో ఆక్సిజన్ బెడ్స్ తో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంటికి మందులు, ఇమ్యూనిటీ పెంచడానికి పోషకపదార్థాలు, పళ్ళు, మల్టీ విటమిన్స్ తక్షణమే ప్రతి ఇంటికి అందించాలి. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి, చమురు సంస్థల నుండి నిధులు తీసుకోవాలి. రెమిడి సేవర్ ఇంజక్షన్లు అమలాపురం సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంచాలని జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు కోరారు.









