
ప్రభుత్వ ఆసుపత్రి చీకటిలో ఇబ్బంది పడుతున్న గర్బిని వార్డులకు స్వంత నిధులతో జనరేటర్ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు దాసరి రాజు
సొంత ఖర్చులతో ప్రభుత్వ ఆసుపత్రికి జనరేటర్ ఏర్పాటు చేసి, నీరందించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజికవర్గ జనసైనికులు, జనసేన సమన్వయకర్త శ్రీ దాసరి రాజు గారు. 3రోజులుగా కరెంటు లేని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రి. జనరేటర్ ఏర్పాటు చేయని ఆసుపత్రి సిబ్బంది. కరెంటే కాదు నీళ్ళు కూడా లేక తీవ్ర ఇబ్బందులు, అవస్థలు పడుతున్న రోగులు,గర్భిణిలు స్త్రీలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి చూసి సొంత డబ్బుతో జనరేటర్ ఏర్పాటు చేసి, 8ట్యాంకర్ల నీరు అందించిన జనసైనికులు మరియు ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త శ్రీ దాసరి రాజు గారు. రోగులు దాసరి రాజు చేస్తున్న సహాయాన్ని మానవత్వంతో అభినందించారు.








