సొంత సామాజిక వర్గానికి పదవులపై ప్రశ్నించిన జనసేన నాయకులు

జనసేన

       నామినేటెడ్ పదవుల పేరుతో వైసీపీ అధినాయకత్వం సొంత సామాజిక వర్గానికి పదవుల జాతర నిర్వహించిందని, జనసేన చిట్వేలి మండల నాయకులు మాదాసు నరసింహ అన్నారు. ముఖ్యమైనవి, పెద్దవి తమ వారికి ఇచ్చుకుని పనికిమాలిన వాటిని మిగిలిన కులాలకి పంచి అదే మహద్భాగ్యమన్నట్లుగా హడావుడి చేస్తున్నారు అని నరసింహ గారు వ్యాఖ్యానించారు. “ఏపీఐఐసీ, ఆర్టీసి, టీటీడీ చైర్మన్ పదవులకు బడుగు బలహీనర్గాల వారు పనికి రారా? సొంత సామాజిక వర్గం వారే కావాలా? సొంత వారికి పల్లకిలో ఊరేగిస్తూ అప్రధాన్య పదవులను ఇతరులకు కట్టబెట్టారు. నిధులు లేని కార్పొరేషన్, కుర్చిలేని చైర్మన్ల నియామకంతో సామాజిక న్యాయం జరుగుతుందా.? గతంలో ప్రకటించిన కార్పొరేషన్ కార్యాలయాలకు ఇంత వరకు అడ్రస్ లేదు. నిధులు , విధులు లేని చైర్మన్ల నియామకంలో వారిని ఉత్సవ విగ్రహాలుగా మిగులుస్తున్నారు అని విమర్శించారు.

See also  వైసీపీ నాయకులను ప్రజలే చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :