ప్రమాదంలో కాలు కోల్పోయిన జనసైనికుడికి రూ.50,000 ఆర్థిక సహాయం మరియు కృత్రిమ కాలు అందిస్తున్న జనసేన నాయకులు డా. బొడ్డేపల్లి రఘు

ప్రమాదంలో కాలు కోల్పోయిన జనసైనికుడికి రూ.50,000 ఆర్థిక సహాయం మరియు కృత్రిమ కాలు అందిస్తున్న జనసేన నాయకులు డా. బొడ్డేపల్లి రఘు

                      విశాఖపట్నం భీమిలి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ జనసైనికుడు గగన్ ప్రమాదవశాత్తూ కాలు కోల్పోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఉత్తరాంధ్ర పార్లమెంట్ సంయుక్త కమీటీ మెంబర్ సురక్ష హాస్పిటల్ ఎండీ డా.బొడ్డేపల్లి రఘు గారు విశాఖలోని Q1 హాస్పిటల్లో ఉన్న గగన్ ను పరామర్శించారు. గగన్ కు రూ. 50,000 ఆర్థిక సహాయం మరియు కృత్రిమ కాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బొడ్డేపల్లి రఘు గారు మాట్లాడుతూ జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నాని, ఆయన సిద్దాంతాల్లో నడుస్తూ నా శక్తి మేరకు సహాయం చేస్తున్నాని అన్నారు. అలాగే గగన్ కు జనసేన నాయకులు , శ్రీ నాయుడు ( తగరవలస ) గారు రూ.10,000 వేలు, శ్రీ శాకరి శ్రీనివాస్ గారు రూ. 5000 వేలు, బీవీ కృష్ణయ్య రూ. 2000 వేలు,శ్రీ పిల్లా శ్రీనివాస్ గారు రూ. 1000 వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయడం జరిగింది. 

See also  జనసేన అధినేతపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం - జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి