పాలకొండ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి, రోగులకు మాస్కులు, శానిటైజర్స్ ను అందించిన జనసేన నాయకులు

పాలకొండ

              శ్రీకాకుళం జిల్లా, పాలకొండ జనసేనపార్టీ అధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో మాస్కులు సానిటైజర్స్, సబ్బులు పంపిణీ చేశారు. జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మేమున్నాము మీకు ఏమి కాదు అని భరోసా ఇస్తూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు ఎంతగానో కృషి చేస్తున్న ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్, సబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆసుపత్రిలో ఉన్న రోగులకు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో గొర్ల మన్మథ, పొట్నురు రమేష్, డొంక శివప్రసాద్, గెంబలి సంతోష్ కుమార్, గర్బపు నరేంద్ర, బిల్లకుటి రమేష్, వన్నలి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి :

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

 

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

 

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

See also  కరోనా ఉధృతిలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహణ రద్దు చేయాలి : జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి