
క్యాన్సర్ వ్యాధితో మరణించిన జనసైనికుడు దీపక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు
దెందులూరు నియోజక వర్గం అమ్మ పాలెం గ్రామంలో, మన జనసేన పార్టీ కార్యకర్త కర్ర దీపక్ గత వారం రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధి కారణంగా దూరం అయ్యాడనీ తెలిసి జనసేన నాయకులు బాధపడ్డారు. ఈ రోజు జన సేన పార్టీ తరపున ఆయన తండ్రి గారిని కలిసి ఆర్ధిక సహాయం మరియు నిత్యావసర సరుకుల అందించి తనకు ఘన నివాళులు అర్పించిన జనసేన పార్టీ నాయకులు కొఠారు ఆదిశేషు, పల్నాటి సాగర్ మరియు జన సైనికులు. జనసేన నాయకులు మాట్లాడుతూ దీపక్ హాస్పిటల్ లో చేర్పించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని సహాయం కోరగా వారి నుండి ఎటువంటి సహాయం అందలేదు అని దీపక్ తండ్రి గారు బాధపడ్డారు. అలాగే జన సేన పార్టీ నుండి వారికి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం ఇప్పుడు అయిన దీపక్ కుటుంబాన్ని ఆదుకోవాలని జన సేన నాయకులు డిమాండ్ చేయడం జరిగింది.








