రాయచోటి జనసైనికులతో జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ గారు ఆత్మీయ సమావేశం

            కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి జనసైనికులు పార్టీ బలోపేతం కోసం దాదాపు 80 మంది జనసైనికులు కలిసి రాయచోటిలో జరిగే పార్టీ పరిస్థితి గురించి అలాగే నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ పరిస్థితి గురించి వివరించారు. అలాగే కమిటీలు వేయాలని రాయచోటి జనసైనికులు కోరారు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గానికి రావాలని కోరారు. దానికి శ్రీ హరిప్రసాద్ గారు మాట్లాడుతూ పార్టీ కోసం కలిసి మెలసి పని చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు , పార్టీ సిద్దాంతాలు ముందుకు తీసుకెళ్తూ పని చేయాలని తెలియజేశారు. త్వరలో రాయచోటి నియోజకవర్గానికి వస్తానని హామీ ఇచ్చారు. పార్టీకి బలం జనసైనికులే అని అన్నారు. పార్టీ కోసం నా వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి జనసేన జనసైనికులు బుడ్డా నాగభూషణం, పఠాన్, గేట్ బాబ్జీ, చిన్నారి జయరాం, కిరణ్, ప్రదీప్, నాగేంద్ర, కొండా, బాదుల్లా, రాజు మరియు తదితర 80 మంది జనసేన సైనికులు పాల్గొన్నారు.

See also  నరవ కళ్యాణ మండపం ను సాధించుకుందాం : పిలుపునిచ్చిన జనసైనికులు