క్రియాశీలక సభ్యత్వ కిట్లును పంపిణీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గ జనసేన నాయకులు

   ఆముదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం హనుమయ్యపేట గ్రామంలో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో  క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న జనసైనికులకు కొత్తకోట. నాగేంద్ర మరియు కోరుకొండా. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కిట్లను అందించారు. సభ్యత్వ నమోదు కిట్లలో 5 లక్షల ఇన్సూరెన్స్ బాండ్లుతో పాటు పార్టీ గుర్తింపు కార్డ్, జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన బుక్ లు ఉంటాయని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న ప్రతి జన సైనికుడు కృషి చేయాలని జనసేన నాయకులు తెలిపారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతలతో కూడిన క్యాలెండర్లు యువతకు మరియు పెద్దలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంపిలి.విక్రమ్, కొల్ల.జైరామ్, హేమంత్, హనుమయ్యపేట కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

See also  మదనపల్లిలో ఇంటింటికి జనసేన టీడీపీ ప్రచారం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి