విజయనగరం జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని జనసేన నాయకులు సత్యాగ్రహ దీక్ష

   విజయనగరం, (జనస్వరం) : ప్రభుత్వం విజయనగరం జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయాలని శుక్రవారం ఉదయం స్థానిక మయూరి జంక్షన్లో విజయనగరం యూత్ ఫౌండేషన్ సహకారంతో.. ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ఆద్వర్యంలో జేఏసీ అద్యక్షుడు శ్రీ బీశెట్టి బాబ్జీ గారితో పాటు జిల్లా పౌరవేదిక సభ్యులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి జేఏసీ దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఆదాడ మోహనరావు, శ్రీ వబ్బిన సత్తిబాబు, శ్రీ వంక నరసింగరావు, జనసేన యువ నాయకులు శ్రీ రౌతు సతీష్, లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు, దాసరి యోగేష్ హాజరయ్యారు.

See also  జనసేన నాయకులు జనసైనికుల పై జరుగుతున్న వారి దాడులపై చర్యలు తీసుకోవాలన్న పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి