శ్రీ దామోదరం సంజీవయ్యకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు కూర్మారావు నారంశెట్టి

సంజీవయ్య

        విజయవాడ ( జనస్వరం ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి, దేశం గర్వించతగ్గ మహానీయుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారి 101వ జయంతి సందర్భంగా #దామోదర_సంజీవయ్య గారికి జనసేన పార్టీ ధార్మిక సేవ మండలి సభ్యులు శ్రీ నార్రంశెట్టి కూర్మరావు గారు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి భవనాన్ని నిర్మించడానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చినటువంటి నాయకులు, దళిత నాయకులని అమితంగా గౌరవించే నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుల స్ఫూర్తితో నైనా ప్రభుత్వం కర్నూలు జిల్లాకు సంజీవయ్య గారి లాంటి గొప్ప నాయకుడి పేరు పెట్టాలని కోరారు. అలా పెట్టి ప్రభుత్వం తరఫున ఆయనకు నిజమైన నివాళి అర్పించాలి అని ప్రభుత్వాన్ని కోరారు.

See also  నర్సీపట్నం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ' అంజనా దేవి ' గారి జన్మదిన వేడుకలు