వీరఘట్టం మండలంలో పర్యటించిన జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

     వీరఘట్టం, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వీరఘట్టం మండలం కంబర వలస, బొడ్లపాడు ఎంపీటీసీ పరిధిలో ఉన్న రేగులపాడు, తూడి గ్రామాల్లో పర్యటించారు. గుడివాడ గ్రామంలో జనసైనికులకు, ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు యొక్క సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. అలాగే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని క్రియాశీలక సభ్యులకు సూచించారు. జనసేన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని వాళ్ళకి క్రియాశీలక సభ్యులు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విధంగా బలమైన మార్పుకు శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉందని జనసైనికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డొంక శివప్రసాద్, వజ్రగడ రవికుమార్ (ఎంపీటీసీ అభ్యర్థి) జనసైనికులు పాల్గొన్నారు.

See also  నరసాపురం మెడికల్ కాలేజీ, జిల్లా కేంద్రాలను అమ్మేసిన ఘనత నర్సాపురం ఎమ్మెల్యేది : బొమ్మిడి నాయకర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి