చిత్రాడలో జనసేన ఫ్లెక్స్ చింపిన ఘటనపై ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

పిఠాపురం, జనవరి 19, (జనస్వరం) : పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్స్‌ను గుర్తుతెలియని అగంతకులు 13–14 తేదీల మధ్య రాత్రి సమయంలో మెయిన్ రోడ్డులో కట్ చేసి చింపివేయడం తీవ్ర ఆందోళనకు గురిచేసిందని జనసేన నాయకులు తెలిపారు. ఈ ఘటన వల్ల గ్రామంలో అనవసరమైన మనస్పర్థలు, గొడవలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా, అన్నదమ్ముల్లా కలిసి ఉండే చిత్రాడ గ్రామ వాతావరణాన్ని చెడగొట్టేలా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. మణికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జాన్, గ్రామ వైస్ ప్రెసిడెంట్ దేశిరెడ్డి సతీష్, దూలపల్లి నాగబాబు, వార్డు ఇన్‌చార్జులు కొట్టేల రాంప్రసాద్ పండు, గాది వెంకటేష్‌తో పాటు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

See also  విజయనగరంలో టీిం పిడికిలి పోస్టర్లును విడుదల చేసిన జనసేన నాయకులు