రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడుని పరామర్శించిన జనసేన నాయకులు

     పాయకరావుపేట, (జనస్వరం) : పాయకరావుపేట నియోజకవర్గంలోనక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామ జనసైనికుడు నిట్లా రాజా కొన్ని రోజులు క్రిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలియజేయగానే వెంటనే స్పందించి జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి గాయపడిన జనసైనికుడు రాజా ఇంటికి వచ్చి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం బుజ్జి మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం రాజా తీసుకున్నారా లేదా అని వివరాలను అదే గ్రామానికి చెందిన జనసైనికుడు నల్లల రత్నాజీని అడిగి తెలుసుకున్నారు అని చెప్పడంతో ఆ వివరాలను పార్టీ కార్యాలయానికి పంపించి ఇన్సూరెన్స్ వచ్చేలా చూస్తామని గెడ్డం బుజ్జి హామీ ఇచ్చారు.

See also  ఎచ్ఛర్ల మండలంలో ప్రభుత్వ అధికారులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన జనసైనికులు