ఆవిర్భావ దినోత్సవ సభలో గాయపడ్డ మహిళకు ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకురాలు పసుపులేటి పద్మావతి

     పెనుకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రమాదవశాత్తు గాయపడిన అనంతపురం జిల్లా, పెనుగొండ మండలం, 13 వ వార్డు కౌన్సిలర్ జనసేన అభ్యర్థి శ్రీదేవిని రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి గారు బాధితురాల ఇంటికి వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకుని, పరామర్శించడం జరిగింది. అనంతరం 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్ట కాలములో ఎల్లప్పుడూ నాయకులకు, కార్యకర్తలకు జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు దేవరకొండ జయమ్మ, సురేష్, నార్పల తేజస్విని, అనంతపురం ప్రమీల, పెనుగొండ లోకేష్, వెంకటేష్, అనిల్, కళ్యాణదుర్గం మమత, త్రివేణి, తార తదితరులు పాల్గొన్నారు.

See also  నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెట్టండి, మీ పబ్లిషిటి మీద కాదు : జనసేన నాయకులు ఇటికోటి క్రాంతి కుమార్