అత్తిలిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

అత్తిలి

          అత్తిలి ( జనస్వరం ) : టీంపిడికిలి వారు పంపిన కౌలురైతు భరోసా యాత్ర పబ్లిష్ పోస్టర్స్ ను  తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఉరదాళ్ళపాలెం గ్రామంలో గ్రామ జనసేన నాయకులు గోలి నరసింహారావు మరియు గ్రామ రైతులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్లు ను గ్రామంలో పలు చోట్ల అంటించడం జరిగింది. అలాగే రైతులకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని నరసింహారావు గారు రైతులకు తెలియచేసారు.  ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. ఈ పోస్టర్లు కు రూపకల్పన చేసి ప్రతి ఒక్కరికి తెలియచేసేలా కృషి చేసిన రాజ మైలవరపు గారికి & టీంపిడికిలి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. 

See also  వృద్ద దంపతులకు నిత్యావసర సరుకుల అందించిన చంద్రగిరి జనసేన నాయకులు