అన్నపూర్ణమ్మ లాంటి అవ్వకు జనసేన అండగా ఉంటుంది – జనసేన ఎంపీటీసీ విక్రమ్

    ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలోని అన్నపూర్ణమ్మ అనే ఒక అవ్వకు 72 ఏళ్ల నిండిన ఇంకా పెన్షన్ రావట్లేదు. అవ్వ 50ఏళ్ల నుంచి జీవన ఉపాధి చేనేత వస్త్రాలు నెయ్యడం. ఇప్పటికీ అవ్వ ఉపాధి మీద ఆధారపడి కుటుంబం బ్రతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిక్కోలు అంపిలి.విక్రమ్ వారి ఇంటికి వెళ్లి అవ్వని పరామర్శించి, కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే కొద్దీ రోజుల్లో అవ్వకి పెన్షన్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం అని జనసేన పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది.

See also  కర్ణాటక రాష్ట్రoలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించిన జనసైనికులు