రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే జనసేన

జనసేన

    విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారం కోసం ఆయన చొరవ చూపిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా ప్రజలను కలిసి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే మంచి పనులను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన 34వ వార్డులో పర్యటించారు. వార్డులోని నవ వధువు హరికకు బంగారు తాళిబొట్టు, పట్టు బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకు అంతా మంచి జరుగుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారని తెలిపారు. ఆయన నేతృత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అది ఒక బాధ్యతగా భావించి ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల సాధనకు ఆవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ప్రజలకు మంచి చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నీలం రాజు , వాసుపల్లి నరేష్ , ప్రసాద్ , గురుమూర్తి , సతీష్ , కుమారి , జనసేన యువనాయకులు కందుల కేదార్నాథ్ , కందుల బద్రీనాథ్, నవ వధువు తల్లిదండ్రులు లక్ష్మి, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

See also  ఫ్రై డే - డ్రై డే అని చెప్తే సరిపోదు, ఆచరణలో పెట్టాలి : పాటంశెట్టి సూర్యచంద్ర