కరోనా నియంత్రణ కోరుతూ జనసేన హోమం : కొత్తవలస జనసేన నాయకులు

               కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో కొత్తవలస మండలం మంగళపాలెం శివాలయంలో సోమవారం మృత్యుంజయ హోమం నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని పార్టీ నాయకుడు వబ్బిన సత్తిబాబు ప్రత్యేక పూజలు చేశారు. జనసైనికులు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. వేదమంత్రాలతో సుమారు నాలుగు గంటలపాటూ పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కరోనా బారిన పడిన పవన్ కల్యాణ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని పూజలు చేశామన్నారు. కోవిడ్ రెండో దశ నుంచి దేశ ప్రజల ప్రాణాలు కాపాడాలని మృత్యుంజయ హోమం జరిపినట్టు వెల్లడించారు. పార్టీ నాయకులు గొరపల్లి రవి కుమార్, మల్లువలస శ్రీను, మళ్ల రాజు, నక్కరాజు సతీష్, గొరపల్లి వెంకట రావు, కోట్ని కొండల రావు, పెంటకోట శ్రీను, గొర్లె శ్రీను, గురజాడ వెంకటేష్, గాలి అప్పారావు, పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

See also  వైసీపీ ఆగడాలను గాంధీకి చెబుదాం