కోవిడ్ భారిన పడిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడి కుటుంబానికి జనసేన సాయం

కోవిడ్

          తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక మూల జనసేన పార్టీ జనసేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గం పరిధిలోని శివకోడు గ్రామంలో శ్రీ కడలి శీనుబాబు అనే వ్యక్తి కిడ్నీలు పాడవడంతో 11 సంవత్సరాల నుంచి చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో అతను నెట్టుకొస్తున్న పరిస్థితి. ఇటీవల ఆ కుటుంబ సభ్యులు మొత్తం కోవిడ్ మహమ్మారి భారిన పడడంతో కనీసం పూట గడవక ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు శ్రీ ఇంటిపల్లి ఆనందరాజు స్థానిక జనసైనికుల సాయంతో 28 రకాల నిత్యవసరాలు ఆ కుటుంబానికి సమకూర్చారు. శివకోడు ఎంపీటీసీ అభ్యర్ధి శ్రీ బద్రి చేతుల మీదుగా ఈ సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీ కోళ్ల బాబి, శ్రీ పిప్పళా అజయ్, శ్రీ కొమ్మారెడ్డి సతీష్, శ్రీ మలిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

See also  అచ్చుతాపురం గ్యాస్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలి : విశాఖ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి