
జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 9వ రోజు సేవాదానం.
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కడప నగరంలోని పద్మావతి వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో జనసేన హెల్పింగ్ హాండ్స్ సభ్యులు కడవకూటి రవి గారి ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ అధ్యక్షతన వృద్ధులకు సాపలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నగర నాయకులు పోస వెంకటేశ్వర్లు ముఖ్యఅతిధిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిస్వార్ధంగా సేవ చేయాలంటే పేద ప్రజలకు అండగా ఉండాలంటే జనసైనికులకే
సాధ్యం అని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కడప జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇందుకు నిదర్శనమని ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీదుగా జరపడం సంతోషమని జనసేన హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షులు కంచన శ్రీకాంత్, గారికి కడవకూటి రవి గారికి, అలాగే తమ్ముడు రంజిత్ గారికి, కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రంజిత్ కుమార్ మాట్లాడుతూ జనసేనాని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కడప నగరంలో 9వ రోజు 9వ కార్యక్రమం శ్రీ పద్మావతి వెంకటేశ్వరా వృద్ధాశ్రమంలో ఈ పెద్దల సమక్షంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఈ సందర్భంగా వారికి అవసరమైన సాపలు వారికి అందజేయడం చాలా సంతోషంగా ఉంది వీరందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు కలకాలం బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోస వెంకటేశ్వర్లు గారికి నా తరఫున జనసైనికులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మయ్య, సుభాన్, జనసైనికులు బాలు నాయక్, సుధాకర్, అతికారి నాగేంద్ర, వంశీకృష్ణ, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, అజీజ్, సుబ్బు, పాల్గొన్నారు.









