
జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 7 వ రోజు సేవాదానం.
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 7 రోజు 7 కార్యక్రమం కడప నగరంలోని చిన్నరాయుడు స్వామి దేవాలయం నందు జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు సానేపల్లి సంజీవ్ ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ అధ్యక్షతన కృష్ణవేణమ్మ, దేవమ్మ అనే ఇద్దరి నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు విలువగల నిత్యవసర సరుకుల కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సాంబశివ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా సాంబ శివారెడ్డి మాట్లాడుతూ ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బిజెపి పార్టీ తరపున మరియు నా తరఫున ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రతిరోజు ఒక కుటుంబాన్ని ఆర్థికంగా నిత్యావసర సరుకుల పరంగా ఆదుకోవడం అటువంటి కుటుంబాలకు అండగా నిలబడడం చాలా గొప్ప విషయం అని ఇటువంటి కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చినటువంటి జనసేన హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, కంచన శ్రీకాంత్ గారికి, ఈ కార్యక్రమం దాత సనేపల్లి సంజీవ్ గారికి అలాగే కడప జనసేన నాయకుడు రంజిత్ గారికీ అభినందనీయులు. పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేద ప్రజలకు అండగా నిలవాలని కోరారు.
పడ్రా రంజిత్ కుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఈరోజు కడప నగరంలో 7 రోజు ఏడవ కార్యక్రమంలో ఇద్దరు నిరుపేద కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు రెండు బియ్యం ప్యాకెట్లు, కందిపప్పు, చక్కెర, ఉప్మా రవ్వ, కొబ్బెర, తెల్లగడ్డలు, ఇలా 21 రకరకాల సరుకులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రెండు కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఆయన చేతుల మీదుగా అందజేసినట్టువంటి కడప జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సాంబశివ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజర్ సెక్రటరీ ఎన్ రవిప్రసాద్, వంశీకృష్ణ, వెంకటేష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.








