
జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 29 వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు చుక్క అయ్యప్ప రెడ్డి గారి ఆధ్వర్యంలో వల్లూరు మండల జనసేన నాయకులు రామ్ సిద్ధూ, షరీఫ్ గార్ల అధ్యక్షతన నాగ మునెమ్మ, బాలమ్మ, అనే ఇద్దరు నిరుపేద మహిళ కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమములో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు అధికారం లేకున్నా ప్రజలకు సేవ చేయాలంటే అధికారం ఏ అవసరం లేదు మంచి సంకల్పం ఉంటే చాలు అని నిరుపేదలకు, అభాగ్యులకు, వృద్ధులకు, చిన్నారులకు, అనేక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు, ఇలా ప్రజలకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చి వారికి అండగా నిలిచి వారికి భరోసా కల్పించడమే మాకున్న ఏకైక అధికారం అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని కడప జిల్లా వ్యాప్తంగా 35 రోజుల పాటు 35 సేవా కార్యక్రమాలు చేపట్టడం అందులో భాగంగా ఈరోజు 28వ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతోంది. జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారికి ఈరోజు కార్యక్రమం దాత చుక్క అయ్యప్ప రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమలాపురం జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అతికారి నాగేంద్ర, వంశీ కృష్ణ, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.









