జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 24 వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 24 వ రోజు సేవాదానం

                 జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ సభ్యులు గనిపిరెడ్డి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో చెన్నూరు మండల జనసేన నాయకుడు అద్దంకి విశ్వనాథ గారి అధ్యక్షతన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న 6 సంవత్సరాల బాలుడు రామ్ చరణ్ బాబు ప్రస్తుతం చెన్నై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ విషయాన్ని బాలుడి తండ్రి ఓబులేష్ గారు జనసేన నాయకులు రంజిత్ కుమార్ రామ్ సిద్దు గార్ల దృష్టికి తీసుకురావడంతో వారు జనసేన హెల్పింగ్ హాండ్స్  కువైట్  వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అతను మంచి హృదయంతో వెంటనే స్పందించి బాబు కి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ( ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20 రకాల సరుకులు ) పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉంటే జనసేన అక్కడ ఉంటుందని అతి చిన్న వయసులోనే బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రామ్ చరణ్ బాబు ప్రస్తుతం అనారోగ్యం కారణంగా చెన్నై లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఈ విషయం తెలుసుకొని చిన్నచిన్న ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు మా అభిమాన హీరో చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ బాబు గారి పేరు పెట్టుకున్న ఇతను ఆ దేవుడు శ్రీరాముడు ఆశీస్సులతో తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మరియు బాలుడు తండ్రి ఓబులేష్ గారు డ్రైవర్ వృత్తిలో ఉపాధి లేక పూటగడవని లేని పరిస్థితుల్లో ఉన్నామని తెలపడంతో మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన నాయకుడికి కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అద్దంకి విశ్వనాధ్ గారు మాట్లాడుతూ రామ్ చరణ్ బాబు అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద వ్యాధి రావడం చాలా బాధాకరమని బాలుడు తండ్రి ఓబులేసు గారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు చాలా బాధ కలిగింది.  ఇతనికి ఉడతాభక్తిగా ఏదో సహాయం చేయాలన్న ఉద్దేశంతో జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ వారి దృష్టికి రంజిత్ కుమార్ ద్వారా తీసుకెళ్లడం జరిగిందన్నారు వారు వెంటనే స్పందించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 35 రోజులు 35 కార్యక్రమాల్లో భాగంగా 24వ రోజు 24వ కార్యక్రమంలో ఈ బాలుడి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు నిత్యవసర సరుకులను అందజేసి వారి కుటుంబానికి అండగా నిలబడడం చాలా చాలా సంతోషంగా ఉంది మంచి మనసుతో స్పందించి ఈ కార్యక్రమానికి ముందు వచ్చిన దాత గనిపిరెడ్డి వెంకటేష్ గారికి జనసేన హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగవరపు చంద్రశేఖర్ గారికి,  అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారికి మరియు జిల్లా వ్యాప్తంగా 35 రోజులు 35 కార్యక్రమాలు తన చేతుల మీదుగా నిర్వహిస్తున్న రంజిత్ కుమార్ గారికి కమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున జనసైనికుల తరపున ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో రామ్ సిద్దు, అతికారి నాగేంద్ర, వంశీకృష్ణ, శ్రీనివాస్, వరుణ్, పాల్గొన్నారు. 

See also  యువతా మేలుకో - జనసేన సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న జనసేన నాయకులు సిద్ధు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి