
జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 16వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హాండ్స్ సభ్యులు రెడ్డి శేఖర్, లింగాల సూరి, గార్ల ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ అధ్యక్షతన రాయచోటి లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వెజిటేబుల్ ఫ్రిడ్జ్ వితరణ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ ముఖరం చాంద్ గారు పాల్గొని ఆయన చేతుల మీదగా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖరం చాంద్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న జనసేన నాయకులు ఎంతైనా అభినందనీయులు 35 రోజులు 35 కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఇలా ప్రతిరోజూ ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయం. జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, కాంచన శ్రీకాంత్ గారికి కార్యక్రమం దాతలు రెడ్డి శేఖర్, లింగాల సూరి, గారికి నా హృదయపూర్వక అభినందనలు రంజిత్ కుమార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడంలో మాకు స్ఫూర్తి నిరుపేదలను ఆదుకోవడంలో మాకు ఆదర్శం ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ మొట్టమొదటిగా ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి పుట్టినరోజును పురస్కరించుకొని 35 రోజులు 35 సేవా కార్యక్రమాలలో భాగంగా 16వ రోజు 16వ కార్యక్రమం ఈ రోజు రాయచోటి లో ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజంపేట పార్లమెంటరీ జనసేన ఇంచార్జ్ ముఖరం చాంద్ గారికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన సైనికులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పవన్ కుమార్, రామ్ సిద్ధూ, అతికారి నాగేంద్ర, కుమార్ నాయక్, రాయచోటి లో ఉండే ప్రేమాలయం సభ్యులు క్రిష్ణ, వెంకటసుబ్బయ్య , రామాపురం మండల జనసేన ఇంఛార్జి నాగేంద్ర, మండల జనసేన అధికారి ప్రతినిధి కొండా, మండల జనసేన కోశాధికారి సంజీవ మరియు జనసైనికులు నాగరాజు, నాగేంద్ర, బాలాజీ, నరేంద్ర పాల్గొన్నారు.









