జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 10వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 10వ రోజు సేవాదానం

       జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి  పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కడప నగరంలో జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు శ్రీ దారపురెడ్డి రామకృష్ణనాయుడు గారి ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదల్ కోఆర్డినేటర్ శ్రీ పండ్రా రంజిత్ కుమార్ గారి అధ్యక్షతన రెండు నిరుపేద మైనార్టీ కుటుంబాలకు ఐదు వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకుల కిట్లు ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ, జనసేన మహిళా నాయకురాలు శ్రీమతి పోస ఆదిలక్ష్మి, శ్రీమతి కుప్పాల జ్యోతి గార్లు పాల్గొని వారి చేతుల మీదుగా జాన్ బి, హుసేన్ బీ, గార్లకు అందజేశారు.  ఈ సంధర్భముగా వారు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు జనసేన హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీగంగారపు చంద్రశేఖర్, అధ్యక్షులు శ్రీ కంచన శ్రీకాంత్, ఈ రోజు కార్యక్రమం దాత శ్రీ దారపురెడ్డి రామకృష్ణనాయుడు, మరియు శ్రీ రంజిత్ గార్లలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు రుక్ష్మిణమ్మ, మంజుల, బిజెపి నాయకులు పోస వెంకటేశ్వర్లు, భానుప్రకాష్, సుభాన్, కమలాపురం జనసేన నాయకులు రామ్ సిద్దు, అతికారి నాగేంద్ర, కడప జనసైనికులు వంశీకృష్ణ, వెంకటేష్, రాఘవ, పాల్గొన్నారు. 

See also  గజపతినగరంలో జనసేన ఆధ్వర్యంలో మన ఊరు.. మన ఆట - సంక్రాంతి సంబరాలు