అహుడా చైర్మన్‌ టి.సి వరుణ్ ను కలిసిన గుంతకల్ సమన్వయకర్త వాసగిరి మణికంఠ

గుంతకల్, ఫిబ్రవరి 6, (జనస్వరం) : అహుడా చైర్మన్ టి.సి వరుణ్‌ను జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అహుడా పరిధిలోని గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చ జరిపారు. ముఖ్యంగా పట్టణాలు, గ్రామాలు, పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన కోసం గతంలో ప్రతిపాదించిన పనులకు నిధులు కేటాయించాలని మణికంఠ కోరారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన అహుడా చైర్మన్ టి.సి వరుణ్ గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ భేటీ గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధికి కీలకంగా మారనుందని జనసేన నేతలు పేర్కొన్నారు.

See also  కన్నబాబు మీకు ఎమ్మెల్యేగా భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ అని మరిచావా ?? : పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి