
రియాద్, మార్చి 14, (జనస్వరం) : సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను JSP టీం రియాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయ జనసైనికులు హాజరై ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యువ నాయకత్వాన్ని పార్టీ కన్వీనర్ అమీర్ ఖాన్ అభినందించారు. సౌదీ అరేబియా JSP టీం రియాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కన్వీనర్ అమీర్ ఖాన్ తన ప్రకటనలో తన టీం స్పిరిట్‌ను మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని, కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, భావి తరాల భవిష్యత్తుకు అండగా ఉండాలని కోరారు. తన మాటల్లో భాగంగా ఇంత గొప్పగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకున్నందుకు, దీనికి ఆహార్నిశలు ఇష్టంతో కష్టపడ్డారని, యువ నాయకత్వం ఏమిటో చేతల్లో చేసి చూపించారని అన్నారు. ఒక పవర్ ఉన్న నిస్వార్థ నాయకుని పార్టీలో ఒక సైన్యమై తమ పవర్ ఏంటో ప్రూవ్ చేసారని కొనియాడారు.

ముఖ్యంగా పెద్దలు GCC ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా సమిష్టి కృషితో ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. జన సందోహం కిక్కిరిసేలా జరిగి, చివరికి డిన్నర్ దగ్గర జనాలను అదుపు చేయలేని పరిస్థితి రావడం తమ పార్టీ మీద, నాయకత్వం మీద, సేవా తత్వం మీద ఇక్కడి ప్రవాసీయులపై బలమైన ముద్రను వేయగలుగుతున్నామని నొక్కి చెప్పారు. ఆ అభిమానాన్ని సభ్యత్వం రూపంలో మలుచుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. అది NRI మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా మనమంతా శ్రమించి దానిని సక్సెస్ చేయాల్సిన బృహత్తర బాధ్యత అందరి మీద ఉందని యువ నాయకుడు మురారి తెలిపారు. ఇందులో భాగంగా లేచి ఎగసిపడే కెరటాల్లా కొంతమంది శ్రమిస్తే, నిశ్శబ్ద తరంగాల్లా ఇంకొంత మంది కష్టపడ్డారని చెప్పారు. తెర ముందు, వెనుకా విలువైన తమ సమయాన్ని వెచ్చించి సమిష్టి కృషితో కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రియాద్ జనసైన్యం ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నందుకు ఆనందంతో పాటు గర్వంగా కూడా ఉందని వీర మహిళా నాయకురాళ్లు ఉషా, రమ్య, సురేఖ, రమా తెలిపారు.

యువ నాయకత్వాన్ని ప్రోత్సహించటం వలన ఎలా దూసుకుపోతారో వీళ్లను చూస్తే తెలుస్తుందని GCC ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు, కంచన శ్రీకాంత్, చందక రాందాస్, మంజుల తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. అప్పజెప్పిన ప్రతి బాధ్యతను ఒక యజ్ఞంలా భావించి సమిధలుగా పనితనాన్ని చూపించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా వీర మహిళా టీం కష్టపడిన తీరు అమోఘమని పేర్కొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెబుతూ అలాంటి బృహత్తర కార్యక్రమాన్ని భుజాలపై ఎత్తుకుని పసందైన వంటలను వండి వార్చిన రావూరి శ్రీను & డి. మహేష్, మేడిచర్ల నాని & టీంను అభినందించారు. క్రౌడ్ రావడానికి తెర వెనుక కృషి చేసిన ఆనందరాజు అనుభవం, ఈవెంట్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసిన మహేష్ నైదాన & టీంను కొనియాడారు. దీనికి మణిహారంలా నిలిచిన వీర మహిళా టీంకు ఎర్రన్న, యాకూబ్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. లాజిస్టిక్ క్రింద కష్టపడ్డ గోవింద్, షేక్ ఘని, అర్జున్ మరియు టీంను అభినందించారు. స్పోర్ట్స్ నిర్వహణతో టీంలో ఒక రకమైన ఫైర్‌ను, కసిని పెంచిన ఇబ్రహీంను ప్రశంసించారు.
స్టేజ్‌ను కనుల విందుగా డిజైన్ చేసిన వీర మహిళలు మనుశ్రీ, మంజు, వీణ, అరుణ, చంద్రకళ, ఉషా, రమ్య తదితరుల కృషిని టీం కొనియాడింది. హెల్ప్ డెస్క్ ద్వారా NRI మెంబర్షిప్‌ను ఎంతో ఓపికతో నిర్వహించిన అరుణశ్రీ, గుంటి మాధవి, మణికంఠ, శ్రీనాథ్ టీంను అభినందించారు. ఫైనాన్స్ & బడ్జెట్ ద్వారా ఈవెంట్‌కు ఏ లోటు లేకుండా చూసిన ఎర్రన్న, లోకేష్, వరప్రసాద్ & టీంకు నిర్వాహక కమిటీ ప్రత్యేక అభినందనలు తెలిపింది. గేమ్స్ నుండి ఈవెంట్ వరకు ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేసిన యాకూబ్ ఖాన్ & యోగేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీటింగ్ హాల్ మరియు డిన్నర్ వద్ద క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన జుత్తా ప్రసాద్, మధు, బద్రి, రెడ్డి రాయల్, లక్కు సాయిరాం & టీంను అభినందించారు. వేడుకను ఆసాంతం తమ మాటలతో, సమయస్ఫూర్తితో సమర్థవంతంగా ముందుకు నడిపిన వ్యాఖ్యాతలు గురు కిరణ్, సురేఖ, రమా, కోకిల టీంకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పనిలో పరకాయ ప్రవేశం చేసిన యువ సంచలనం సీతారాంను ప్రత్యేకంగా అభినందించారు. చివరిగా ఇంతమంది సుశిక్షిత సైన్యాన్ని ఎంతో దీక్షతో, పక్కా ప్లానింగ్‌తో సమర్థవంతంగా వినియోగించి, జనరంజకంగా వేడుక సాగేలా సౌదీ JSP టీం ప్రతిష్ట పెరిగేలా కృషి చేసిన యువ నాయకుడు మురారికి టీం మొత్తం అభినందనలు తెలిపింది. ఇది సమిష్టి కృషితో సాధ్యమైందని, ఇలానే మునుముందు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని కన్వీనర్ అమీర్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.









