కుప్పంలో జనసేన రైతు దీక్ష : రైతులకు తక్షణ సాయం అందించాలి

కుప్పంలో జనసేన రైతు దీక్ష : రైతులకు తక్షణ సాయం అందించాలి

                 జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 35 వేల రూపాయలు అందించాలని, తక్షణ సాయం కింద 10,000 వేల రూపాయలు అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. జనసేన కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ముద్దినేని వెంకటరమణ అధ్యక్షతన రామకుప్పం MRO ఆఫీసు ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని, కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ దీక్షకు రామకుప్పం మండల అధ్యక్షులు హరిష్ , ఉప అధ్యక్షులు రఘు రాయల్ మరియు శ్రీకాంత్  కమిటీ సభ్యులు గంగాధర్, అజిత్, నవీన్, అంజి ప్రసాద్, హరిష్, మోహన్ రావు, శాంతిపురం మండల అధ్యక్షులు రఘుపతి మరియు నాయకులు సంఘీభావం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

See also  ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం యొక్క సాగునీటి హక్కులను కాపాడాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు పోరుబాటు