జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటనను విజయవంతం చేయాలి : తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్

విశాఖ పర్యటన

    కాకినాడ, (జనస్వరం) : జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటన విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక హల్కంటైన్స్‌ క్లబ్‌ లో జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు “కందుల దుర్గేష్‌ అధ్యక్షతన పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరియు జిల్లా నాయకులతో సమావేశం జరిగింది. ఈ నెల 31వ తేదీన విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ గారు విశాఖ పర్యటనలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో అన్ని నియోజవర్గాల నుంచి జనసేన శ్రేణులు సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్‌, పితాని బాలకృష్ణ, నియోజకవర్గం ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, తుమ్మలబాబు, మాకినీడి శేషుకుమారి, అత్తి సత్య నారాయణ, పాఠం శెట్టి సూర్య చంద్ర, బండారుశ్రీనివాస్‌, వేగుళ్ల లీలా కృష్ణ, మరెడ్డి శ్రీనివాస్‌, మరియు రాష్ట్ర కమిటీ, జిల్లాకమిటీ నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

See also  చేజర్ల మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు