జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తగదు : చిట్వేలి జనసేన నాయకులు మాదాసు శివ రాయల్

చిట్వేలి

    చిట్వేలి, (జనస్వరం) : నిజాయితీకి మారు పేరు అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు శివ రాయల్ ఖండించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాపుల రిజర్వేషన్లు గురుంచి మాట్లాడాలని, అలాగే బడ్జెట్ లో కాపులకు కేటాయించిన నిధుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం కాపులకు చేసింది ఏమి లేదని, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం తగదని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిట్వేలి మండల నాయకులు, నానబల మహేంద్ర, నాగిశెట్టి నాగేంద్ర, పగడాల శేషాద్రి, యెద్దల చెంగల్రాయుడు, తోట శివ ప్రసాద్ తదితురులు  పాల్గొన్నారు.

See also  వైసీపీ నాయకుల భూదందాను అడ్డుకోవాలని జనసేన నాయకుల నిరసన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి