విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేట్ పరం చేయవద్దంటూ జనసేన వీర మహిళల సంఘీభావం

             ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేట్ పరం చేయవద్దంటూ సేవ్ స్టీల్ చలో వైజాగ్ అని అఖిలపక్షాలా పిలుపుకు మద్దతుగా జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి 75వ వార్డు శ్రీమతి కోన పద్మ గారి ఆధ్వర్యంలో తన గ్రామంలో స్వగ్రామంలో ఉన్న వీర మహిళలతో కూర్చుని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగాలు తో 15 వేల మంది రైతులు భూములు తీసుకున్న, 22వేల ఎకరాల్లో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి, ఈ స్టీల ప్లాంటు లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు లక్షల జనాభా ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అలాంటి ప్లాంటును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని అన్నారు. ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదని అలాంటి ఆలోచన తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. అలా కానీ పక్షంలో త్వరలోనే 75వ వార్డులో, పెద గంట్యాడ మండలంలో సంబంధించి అన్ని పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, యువజన సంఘాలు, మేధావులతో అఖిలపక్షం ఏర్పాటు చేసి వీధి వీధినా వాడవాడలా ఉద్యమన్ని చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో k విమల, సంతోషి, మాధురి తదితరులు పాల్గొన్నారు. 

See also  యళ్ళాయపాలెం గ్రామం పరిధిలో అక్రమ మట్టి మాఫియా బరితెగింపు : నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి