కర్నూలు జిల్లాలో వంతెన నిర్మించాలని జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

కర్నూలు జిల్లాలో వంతెన నిర్మించాలని జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

           కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని జమ్మిచెట్టుఏరియా-జోహరాపురంగ్రామాల మధ్యలో ఉన్న జోహరాపురంవంతెనమరియు ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉన్న వంతెన పనులు నత్తనడకన సాగడం పట్ల నిరసన తెలియజేస్తూ కర్నూలుజిల్లా జనసేన-బిజెపి కూటమి ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ రాయలసీమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నిధులు పాతబిల్లులకోసం విడుదల చేయించుకుని కమీషన్లు తీసుకుని వంతెన నిర్మాణాన్ని గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. అధికారులు సత్వరమే స్పందించి వంతెన నిర్మాణం పూర్తిచేయకపోతే త్వరలోనే ప్రజలతో కలిసి తీవ్రస్థాయిలో ధర్నాలుచేసి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అర్షద్‌గారు, జనసేన వీర మహిళ అనితశ్రీ గారు తో పాటు బిజెపి నాయకులు రామస్వామిగారు, రామకృష్ణ గారు మరియు అధికసంఖ్యలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, బిజెపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

See also  పక్షవాతం వ్యాధితో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకున్న NRI జనసేన వీరమహిళ బూరకల గీతాంజలి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి