ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దారు గారికి వినతి

ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దారు గారికి వినతి

         విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం జనసేన, బీజేపీ నాయకులు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను పట్టించుకొని, వాటికి పరిష్కారం దిశగా ఆలోచించాలి అన్నారు. ఈ కరోనా సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. అలాగే మండలంలో జరుగు వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క అధికారిక కార్యాక్రమాలు చేసేటప్పుడు వేదికపై ఎమ్మేల్యేలు మరియు మంత్రులు మాత్రమే ఉండాలి. గతంలో కార్యకర్తలు కూడా వేదికపై ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇకపైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు జరిగిన మా పార్టీలకు తెలియజేయండి. మేము కూడా హాజరు అవుతాము అని జనసేన మరియు బీజేపీ పార్టీలు కలసి తహశీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన తరుపున వబ్బిన సతీష్, కారుకొండ రవి కుమార్, పర్రి వెంకటేష్ బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

See also  నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం ఆగదు : అనపర్తి జనసేన నాయకులు