మైసూర్ వారిపల్లి పంచాయతీ గెలిచిన జనసేన సర్పంచ్ కారుమంచి సంయుక్త గారికి సన్మానం చేసిన జనసేన , బీజేపీ జనసేన నాయకులు

                రైల్వేకోడూరు మండలంలోని మైసూర్ వారిపల్లి పంచాయతీ జనసేన పార్టీ బలపరిచి సర్పంచ్ గా గెలిచిన శ్రీ కారుమంచి సంయుక్త గారికి జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో నేడు ఘనంగా సన్మానం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో పట్టుదలతో మైసూర్ వారిపల్లె గ్రామస్తులు సాధించుకున్న ఈ విజయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అన్నారు. జనసేన పార్టీ సర్పంచ్  పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలని అందుకు కావలసిన జనసేనపార్టీ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూర్ ZPTC జనసేన పార్టీ అభ్యర్థి ఉయ్యాల మధులత, అనంత రాయలు రఘుపతి సుబ్రహ్మణ్యం, చలపతి గౌరీ శంకర్ వెంకటేష్ మొదలగు జనసేన పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

             

See also  బొబ్బిలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకి మద్దతు తెలిపిన జనసేన పార్టీ