
మడ అడవులపై జనసేన విశ్లేషణ, పోరాటం : బొలిశెట్టి సత్య నారాయణ, పోలసపల్లి సరోజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదలందరికీ ఇళ్ళు అనే పథకంలో భాగంగా విలువైన భూములు గల కాకినాడ పట్టణంలోని 50 వార్డులకు చెందిన 24,388 మంది లబ్ధిదారులను ఎంపికచేసి, వారికి నగరంలో పూర్తి స్థాయిలో భూమి లభించక పోయే సరికి, కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన భూములు 1978/79 నుంచి అభివృద్ధి చేయలేదు అనే ఉద్దేశంతో, సర్వే నంబరు.376 పార్టు, 375/1, 1985/పార్టు మరియు 2004/పార్టులో ఉన్న 100 ఎకరాల పైన మడ అడవులు ఉన్న భూమిని కలెక్టరు గారు ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకుని పేదలకు ఇళ్ళు పథకం అమలు కింద జత చేసి, మడ అడవులను నరికివేసి, అక్కడ నేలను పూర్తిగా మట్టి పోసి చదును చేయటం జరిగింది. అందునా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు దేశమంతా అమలులో ఉన్న సమయంలోనే చేయటంతో, స్థానికంగా ఉన్న దుమ్మల పేట, పర్లో పేట గ్రామాలకు చెందిన పల్లేకారులు రోడ్డు పైకి వచ్చి అధికారుల ప్రవర్తనను లాక్ డౌన్ నిభంధనలను కూడా ఉల్లంఘన చేసి నిరసించటం జరిగింది. ఈ విషయాన్ని ప్రముఖ పర్యావరణ పరిరక్షణవేత్త జనసేనపార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ గారి దృష్టికి స్థానిక పల్లేకారులు తీసుకురావటంతో ఆయన సదరు మడ అడవులు కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న భూములుగా గుర్తించి, దీని పైన ప్రధాన మంత్రి, కేంద్ర అటవీశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పర్యావరణ సంస్థల దృష్టిలో పెట్టినప్పటికి, మడ అడవుల నరికివేత కోనసాగుతూ ఉండటం విశేషం. సి.అర్.జెడ్. నిబంధనలు, 2011 మరియు 2019; పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986; అటవీ పరిరక్షణ చట్టం, 1980; వన్య ప్రాణుల పరిరక్షణ చట్టం, 1972 జాతీయ జీవ వైవిధ్య చట్టం,2002 మరియు రాజ్యాంగ అథికరణాలు.48-A, 51-A(g) ఉల్లంఘనలు కింద జాతీయ హరిత ట్రిబ్యునల్, చెన్నై లో O.A.No.65/2020ని ది.16-04-2020న దాఖలు చేయటం జరిగింది. దీని పైన కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టరు లను ప్రతివాదులగా చేర్చటం జరిగింది.
దీని పైన జాతీయ హరిత ట్రిబ్యునల్ లో 30-04-2020న వాదనలు జరిగినవి. జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించి దిగువ తెలిపిన విథంగా ఉత్తర్వులు మద్యంతరంగా జారీ చేయటం జరిగింది. ఐదుగురు సభ్యులతో కూడిన పరిశీలన బృందాన్ని నియమించటం జరిగింది. దీనిని చెన్నైకి చెందిన కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అధికారి నేతృత్వం వహించారు. దీనిలో రాష్ట్ర కోస్తా తీర ప్రాంతం అథారిటీ సీనియర్ అథికారి, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు మరియు కాకినాడ జిల్లా అటవీ అధికారి సభ్యులుగా ఉంటారు. సదరు పైన తెలిపిన కమిటీ ఆరు నెలల వరకు కేంద్ర అటవీ శాఖ అథ్వర్యంలో ఉన్న కాకినాడ మడ అడవుల సాటిలైట్ చిత్రాల అథారంగా సదరు ప్రాంతాన్ని పరిశీలన చేయాలి. దీనికి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సహకారం అందించాలి. తదుపరి విచారణను ది.18-08-2020కి వాయిదా వేయటం జరిగింది. దానిని 10-12-2020 న కాకినాడ దుమ్మలపేట నందు జాతీయ హరిత ట్రిబ్యునల్ వారు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వాటి వివరాలను స్థానికంగా ప్రథమ మేయర్ అయినటువంటి శ్రీమతి పోలసపల్లి సరోజ గారిని అడిగి తెలుసుకున్నారు. మడ అడవులు కాకినాడకు ప్రకృతి వైపరీత్యములు రాకుండా కాపాడుతూ ఉన్నాయి. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నాయి. వీటిలో పెరిగిన చేప సాల్ట్ క్రిక్స్ ద్వారా సముద్రంలో ప్రవేశించిన తర్వాత సాంప్రదాయ మత్స్య సంపదగా మారిన తర్వాత మత్స్యకారులు నామాలు ద్వారా సముద్రంలోకి వెళ్లి చేపల వేట చేసుకుని జీవనం సాగిస్తు ఉంటారు. తుఫాన్లను సునామీలు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ సాల్ట్ క్రిక్స్ నందు మత్స్యకారులు అయిన వారి జీవనోపాధికి సంబంధించి భద్ర పరుచుకునేందుకు ఈ కాల్వలను ఉపయోగించుకుంటున్నారు.
పైన తెలియజేసినటువంటి ఉపయోగాలు కాకుండా మరెన్నో ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ వైపరీత్యాల నుండి ఈ మడ అడుగులు సాల్ట్ క్రిక్స్ కాకినాడ పరిసర ప్రాంతాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నాయి. ఉదాహరణ గతంలో 1996లో మరియు 1999 సంవత్సరాలలో సంబంధించినటువంటి భయంకరమైన తుఫానుల నుండి అలాగే 2005 సమయంలో వచ్చినటువంటి సునామి తాకిడి నుండి కాకినాడను, కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడినటువంటి సందర్భం ఉంది. ఈ కాకినాడ నగర తీరానికి అతి సమీపంలో అనగా పోస్ట్ ఆఫీస్ వెనకాల గతంలో ఉన్నటువంటి ఇ వందల ఎకరాల ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పాటు కాబడినటువంటి ఈ మడ అడవులను మరియు సాల్ట్ క్రీక్ పాండులను ప్రభుత్వం ఇల్ల పట్టాల పేరిట ఈ మడ నరికి మట్టితో పూడ్చి వేసేందుకు సిద్ధమయ్యారు. ఆదిశగా పనులు చేపట్టారు అదే గాని జరిగితే రేపు రాబోయే రోజుల్లో కాకినాడ నగరాన్ని జాతీయ ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదానికి ఇక్కడ అధికారులు శ్రీకారం చుడుతున్నట్లే అంతేకాకుండా కాకినాడ ప్రాంత సమీపంలో ఉన్న సుమారు 18 మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి సుమారుగా 90 వేల మంది కుటుంబాలు పూర్తిస్థాయిలో జీవనోపాధి కోల్పోవడమే కాకుండా పూర్తిస్థాయిలో మత్స్య సంపద నాశనం అయింది. మత్స్యకారుల మనుగడ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే జీవన విధానానికి పర్యావరణానికి సంబంధించి అతి ప్రమాదకరమైన పరిణామాలు ఏర్పడే పరిస్థితి కాకినాడ ప్రజలకు వస్తుంది. కావున తమరు కాకినాడ నగరాన్ని సముద్ర గర్భంలోకి కలిసిపోకుండా జీవన వైవిధ్యాన్ని కాపాడే విధంగా మత్స్యకారుల జీవనోపాధి నాశనం కాకుండా కాకినాడ రాష్ట్రాన్ని మరియు దేశాన్ని కాపాడుతున్న ఇటువంటి ఈ చెట్లను నరికి వేయకుండా ప్రకృతి వైపరీత్యాలను సంభవించకుండా ఈ చెట్లను రక్షించవలసిందిగా ఆమె కోరారు. శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు అందించిన ప్రోద్బలంతో వాటి గురించి ఇంకా క్లుప్తంగా అవసరమైన విషయాన్ని అంతా వారికి అందజేసారు. వారు వాటిని తీసుకుని సానుకూలంగా పరిష్కార దిశగా ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.








