
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా జనసేన : నేమూరి శంకర్ గౌడ్
రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలే లక్ష్యంగా జనసేన నాయకులు, జనసైనికులు సమిష్టిగా పనిచేయాలని, ఇప్పటి వరకు తెలంగాణలో ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రజాసమస్యలపై పోరాటాలు, సేవా కార్యక్రమాలకు పరిమితమైన జనసేన ఇకపై బూత్ స్థాయి నుండి బలోపేతం చేసి, ఎన్నికల్లో సత్తా చాటుతామని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు తెలియజేసారు. ఈరోజు హైదరాబాద్, ప్రశాసన్ నగర్ లోని, పార్టీ కేంద్ర కార్యాలయంలో జిహెచ్‌ఎంసి నాయకులతో, విద్యార్థి, యువజన విభాగాలతో నిర్వహించిన కీలక సమావేశంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని 50 డివిజన్లలో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు, కష్టపడే జనసైనికులకు, నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజల తరపున గళం వినిపించేలా తీర్చిదిద్దుతాము. అలాగే విద్యార్థి విభాగం, యువజన విభాగం, వీర మహిళ విభాగాల సభ్యులు అందరూ కూడా జిహెచ్‌ఎంసి ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అన్నివర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించడం జరిగింది. రానున్న కాలంలో తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలి. బూత్ కమిటీల నిర్మాణం, వారి పనితీరును ఎప్పటికప్పుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వి. రామారావు గారు పర్యవేక్షిస్తారు. కమిటీ నిర్మాణంలో ఏవిధమైన సమస్యలు ఉన్నా వెంటనే ఆయన దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాతంలో 2 రోజుల పర్యటన పూర్తయిన వెంటనే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిస్థాయిలో జిహెచ్‌ఎంసి ఎన్నికలపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారని, కావున జనసైనికులు, జనసేన నాయకులు అందరూ కూడా మరింత బాధ్యతగా, ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికల కోసం పనిచేయాలని పిలుపునిస్తున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, తెలంగాణ నాయకులు శ్రీ అర్హమ్ ఖాన్, జిహెచ్‌ఎంసి కమిటీ అధ్యక్షులు శ్రీ రాధారాం రాజలింగం, పార్టీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వి రామారావు తదితరులు పాల్గొన్నారు.








