సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చల్లా యానాదులకు జనసేన సాయం

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చల్లా యానాదులకు జనసేన సాయం

                తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు జీవనం కోల్పోయిన చల్లా యానాది కుటుంబాలకు జనసేన పార్టీ సహాయం చేసింది. మండలంలోని నేలటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 20 కుటుంబాలకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆదివారం దుప్పట్లు, కూరగాయలు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఆ పార్టీ జిల్లా పార్లమెంటరీ కమిటీ నాయకురాలు పోలంరెడ్డి ఇందిరా రెడ్డి, నియోజకవర్గ వీర మహిళ అలహరి దీపిక, జనసైనికులు హాజరయ్యారు. మాజీ వార్డు సభ్యురాలు శైలజ, గ్రామస్తులు ఏడుకొండలు సహకారం అందించారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఆయన భరోసా కల్పించారు. ధైర్యంగా ఉండాలని తమ వంతు సహకారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

See also  క్రాంబే రోడ్డుకు ఖుద్దూస్ రోడ్డుగా నామకరణం చేయాలి : విజయవాడ జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్