పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సోంపురం గ్రామ జనసైనికులు

సోంపురం

            విజయనగరం ( జనస్వరం ) : ఎక్కడ కష్టమున్నా జనసేన ముందుంటుందని మరలా నిరూపించుకున్నారు జనసైనికులు. వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ కూతురుకి మూడు నెలల క్రితం కవల పిల్లలుకు జన్మనిచ్చింది. ఏడవ నెలలో ప్రసవం అవడంతో పిల్లలకు గత రెండు నెలలుగా హాస్పిటల్లో ఇబ్బందులు పడుతూ నేటికీ చాలా మొత్తంలో డబ్బులు ఖర్చయ్యాయి. ఈ విషయం తెలిసిన సోంపురం జనసైనికులు మనకు తోచినంతలో మనం సాయం చెయ్యాలని పెద్ద మనసు చేసుకొని జనసైనికులు 9000 రూపాయలు పోగు చెయ్యగా దానికి 11000 రూపాయలు జొన్నపల్లి సత్తిబాబు, 5000 రూపాయలు, సుంకరి అప్పారావు 5000 రూపాయలు, అలమండ రాంబాబు 1000 రూపాయలు కలిపి మొత్తం 20000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న శివశంకర్ వాళ్ళతో మాట్లాడి మీకు జనసైనికులు అండ ఎప్పుడు ఉంటుందని చెప్పి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడదాం అని చెప్పి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది.

See also  ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన జనసేన నాయకులు జయరాం