జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి జనసైనికులు సమైక్యంగా శ్రమించాలి : బత్తుల వెంకటలక్ష్మి

జనసేన

        రాజాం ( జనస్వరం ) : “జనం కోసం జనసేన” “మహా పాదయాత్ర° 67వ రోజులో భాగంగా.. “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్  బత్తుల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగింది.  రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో హల సింగర్ పేట వీది ఇంటింటికి తిరుగుతూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సామాజిక లక్ష్యాలు వివరించారు. ఈ వైసీపీ అరాచక ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ, జనసేన ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు, భావితరాలకు జరగబోయే మంచిని వివరిస్తూ ప్రజాదారణతో ముందుకు సాగింది. ఈ సందర్భంగా జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ జనసైనికులు అందరూ క్రమశిక్షణతో సమైక్యంగా శ్రమించి, జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీర మహిళలు, కోరుకొండ మండల జనసేన నాయకులు, హాల సింగర్ పేట జనసైనికులు పాల్గొన్నారు.

See also  కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సలహాలు సూచించిన జగ్గంపేట జనసేన నాయకులు పాతంశెట్టి సూర్య చంద్ర

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి