జనసైనికులు అన్ని చోట్ల పోటీకి సిద్ధం : ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖగౌడ్

                         కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గోనెగండ్ల మండల పరిధిలోని అన్ని గ్రామలలో ఉన్న జనసేనపార్టీ కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో గురువారం పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలతో సమావేశమై పంచాయితి ఎన్నికల గురించి చర్చించారు. కార్యకర్తలను ఉద్దేశించి రేఖగౌడ్ మాట్లాడుతూ ప్రతి జనసైనికునికి తమ గ్రామల అభివృద్ధి కోసం కృషిచేసే ఆవకాశం వచ్చిందని బరిలో నిలిచి యువత సత్తా చాటాలని పిలుపునిచ్చారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం గ్రామాల్లో సైనికుల్లా పనిచేసే ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకెళ్లాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామంజి నేయులు, మండల సమన్వయకర్త ఖాసీంసాహెబ్, హరికృష్ణ, షఫీ, భాస్కర్, సుబాన్, సుందర్ రాజు, విక్రమ్పా తదితరులు పాల్గొన్నారు. 

See also  తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకుడు నగిరి పాటి. మహేష్ గారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి