నాగుల్లంక గ్రామంలో వరద బాధితులకు భోజనం ప్యాకెట్స్ అందించిన జనసైనికులు

నాగుల్లంక

           గన్నవరం ( జనస్వరం ) : గన్నవరం మండలంలో యర్రంశెట్టివారిపాలెం జనసేనపార్టీ తరుపున సర్పంచ్ మరియు జనసైనికుల సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని నాగుల్లంక గ్రామంలో పర్యటించి భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ లంక గ్రామాలలో ప్రజలు వరదలకు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం సరైన కనీస సౌకర్యాలు అందించట్లేదని వాపోయారు. జనసేన పార్టీ తరుపున వరద బాధితులకు ఆహార పొట్లాలను అందించామని అన్నారు. దీని నిమిత్తం సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయజేశారు. 

See also  జనసేన కార్యకర్తలందరు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి : తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి