కళ్యాణదుర్గంలో జనలోకి జనసేన కార్యక్రమం

కళ్యాణదుర్గం

         కళ్యాణదుర్గం ( జనస్వరం ) : పట్టణంలో స్థానిక మారంపల్లి, పార్వతి నగర్ లో ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది… జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మనోగతం బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.. మారంపల్లి జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జాకీర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ప్రజా కార్యక్రమాలను, జనవాణి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు లక్ష చొప్పున మొత్తం 30 కోట్లు బాధ్యత కుటుంబాలకు అందజేయటం మొదలైన అనేక జనసేన కార్యక్రమాల గురించి కాలనీ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళ షేక్ తార, జనసేన నాయకులు వంశీ, ముక్కన్న, మహేష్, మారుతి, చిరంజీవి మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  ఏలూరులో ఇళ్ళు దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి