జలదంకి భజన బృందానికి జనసేన చేయూత కార్యక్రమం

ఉదయగిరి, అక్టోబర్ 14, (జనస్వరం) : జలదంకి మండలం చిన్నక్రాక గ్రామంలో భజన భక్తులు నిర్వహించే గజ్జ పూజ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక చేయూత అందించారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న గజ్జ పూజకు భజన బృందాన్ని ప్రోత్సహిస్తూ పార్టీ కమిటీ సభ్యులు గుండాబత్తిన రామ్మూర్తి ప్రధాన కార్యదర్శి, తెలపోలు రమేష్, రవి ముగ్గురు కలిసి పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

భజన బృందానికి అండగా నిలబడటం తమకు ఆనందంగా ఉందని వారు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తిస్తూ, సేవా కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా పార్టీ బలోపేతం చేయడం తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సీనియర్ నాయకుడు భోగినేని కాశీ రావు సూచనలు, సలహాలు, ధైర్యం ఎల్లప్పుడూ తమకు బలంగా నిలుస్తున్నాయని కమిటీ సభ్యులు అభినందించారు.

See also  వైసీపీ నాయకులు డ్రామాలు ఆపండి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి