అరట్లకోటలో ఘనంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

      అరట్లకోట్ల, (జనస్వరం) : అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలానికి చెందిన అరట్లకోట్ల గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో జనసేనపార్టీ అధినేత, వ్యవస్థాపకులు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అరట్లకోట గ్రామ సర్పంచ్ పులగపూరి అప్పల నరస మరియు జనసైనికుల చేతుల మీదగా సుమారు 150 మంది విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్లు, పలకలు, పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అప్పలనరస మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చదువుతోనే పేదరికాన్ని జయించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే.రామారావు, ఎం. భారతి, కే. శ్రీదేవి, జనసైనికులు గర్లంక ప్రకాష్, నడిగట్ల వరప్రసాద్, సత్తిబాబు, తుమ్మలనానాజీ, నాని, జాజి, భాను, వీనిల్, జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడంతో ప్రజాస్వమ్యానికి చీకటి రోజు