జనసేనాని వారాహి యాత్ర విజయవంతం కావాలని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పాలకొండ జనసైనికుల పూజలు

పాలకొండ

            పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం, నడుకురు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స. పుండరీకం మాట్లాడుతూ వారాహి అంటే దుష్టులను శిక్షించేది అని అర్థం అందుకే వైస్సార్సీపీ నాయకులు భయపడుతున్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది పవన్ కళ్యాణ్ గారు చేసే వారాహి బస్ యాత్ర తో సాధ్యం అవుతుంది అని పుండరీకం తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాటం చేస్తుంది, తెలంగాణ రాష్ట్రం లో కొండగట్టులో వారాహి వాహనం కి పూజ జరిగిన సమావేశంలో ఇక్కడ ప్రత్యేక పూజా జరిపామని, అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయ వారాహి బస్ యాత్ర విజయవంతం కావాలని అభయ ఆంజనేయ స్వామి కోరుకున్నామని మత్స. పుండరీకం తెలిపారు. ఈ కార్యక్రమంలో చింత గోవర్ధన్ , కలిపిల్ల సింహ చలం, వాన కైలాష్ తదితరులు పాల్గొన్నారు.

See also  88వార్డ్ సత్తివానిపాలెం గ్రామంలో డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :