గుంతకల్‌లో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు మహోత్సవం

– గుంతకల్ లో ఉద్యమంలా జనసేన “ఉద్యమి” (క్రియాశీలక సభ్యత్వ) నమోదు మహోత్సవం…

– పండుగ వాతావరణం లో బాణాసంచా పేలుస్తూ, డీజే మొతలతో హోరెత్తించిన యువత…

గుంతకల్, మార్చి 3, (జనస్వరం) : జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘ఉద్యమి’ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గుంతకల్ పట్టణంలో ఉత్సాహభరితంగా జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బాణాసంచా పేల్చుతూ, డీజే మోతల మధ్య సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుంతకల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంట్ ఉద్యమి కార్యక్రమ సమన్వయకర్త, జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ హాజరయ్యారు. ఆయనతో పాటు జిల్లా నాయకులు కాయగూరల లక్ష్మీపతి, కాసెట్టి సంజీవరాయుడు, గ్రంధి దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయన పోరాట స్ఫూర్తిని వివరించారు. ఉద్యమ స్ఫూర్తితో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంతకల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుంతకల్, గుత్తి, పామిడి మండలాల అధ్యక్షులు బండి శేఖర్, కురువ పురుషోత్తం, చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, ధనుంజయ, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు పాండు కుమార్, వీరమహిళలు, మైనారిటీ నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  కలిస్తేనే కలవరమా... వారాహిపై వస్తే ఏమవుతారో ??? : జనసేన నాయకులు భవానీ రవి శంకర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి