రాప్తాడులో ఉద్యమంలా జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ ఆత్మీయ సమావేశం

రాప్తాడు, మార్చి 3, (జనస్వరం) : జనసేన పార్టీ “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో జయప్రదం చేయాలని రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో నిర్వహించిన ఉద్యమి సభ్యత్వ ఆత్మీయ సమావేశానికి హిందూపురం ఉద్యమ సమన్వయకర్త, ఒంగోలు అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, జనసేన జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో సభ్యత్వాలను వేగవంతం చేసి పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. వీరమహిళలు, క్రియాశీలక వాలంటీర్లకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సాకే పవన్ కుమార్ మాట్లాడుతూ జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వం కేవలం రాజకీయ మెంబర్షిప్ కాదని, అది బాధ్యత, నిబద్ధత, సంకల్పమని పేర్కొన్నారు. టి.సి. వరుణ్ మాట్లాడుతూ సమాజ మార్పు కోసం యువత ముందుకు రావాలని, విలువలతో కూడిన భవిష్యత్తు కోసం జనసేనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. షేక్ రియాజ్ మాట్లాడుతూ రాజకీయాలు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం నిలబడటమే ముఖ్యమన్నారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రతి యువకుడు ‘ఉద్యమి’ సభ్యత్వం తీసుకుని ఈ ప్రయాణంలో భాగం కావాలని కోరారు. మండలాల అధ్యక్షులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు, జనసైనికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

See also  అనంతపురం నగరంలోని సమస్యలపై మున్సిపాలిటీ అధికారులకు వినతిపత్రం ఇచ్చిన జనసేనపార్టీ నగర అధ్యక్షులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి