లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన జనసేన – టీడీపీ శ్రేణులు

జనసేన

      గుంటూరు ( జనస్వరం ) : మిఛౌన్గ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి అవసరం వచ్చినా ప్రజలకు జనసేన, టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉంటాయని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మంగళవారం 22వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, టీడీపీ అధ్యక్షుడు షేక్ నాగూర్ లతో కలిసి కార్మికుల కాలనీలోని పీకలవాగు పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వర్షంలోనే పర్యటిస్తూ ప్రజలను కలిసి మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ మరో 48 గంటలు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్న నేపధ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలకు అందుబాటులో నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ 0863 -2234014 అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉంటాయని ఆళ్ళ హరి తెలిపారు. మెహబూబ్ బాషా, కోలా అంజి, నైజామ్ బాబు, మల్లి, జిలాని, అలా కాసులు, బియ్యం శ్రీను, రమేష్, సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

See also  రైతులు సహా ప్రతి ఒక్కరిని మోసగించడం CBI దత్తపుత్రుడు జగన్ కు వెన్నతో పెట్టిన విద్య